పరిటాల తనయుడు శ్రీరామ్‌పై కేసు: స్పందించిన టిడిపి

ఫ్యాక్షనిజానికి పరిటాల శ్రీరామ్ ఎప్పుడూ దూరంగా ఉంటున్నాడన్నారు. ఆయన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు సిద్దమయ్యాడని, అలాంటి సమయంలో కేసు బనాయించడం సరికాదన్నారు. శ్రీరాం భవిష్యత్తుని నాశనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన సభలు తెలుగు మహాసభలు కాదని అవినీతి మహాసభలు అన్నారు. సోనియాకు ఇష్టం లేదన్న కారణంతో పివిని కాంగ్రెసు ఘోరంగా అవమానించిందని, ఢిల్లీలో పివి సమాధికి చోటివ్వలేదన్నారు. తెలుగు వాళ్ల భోజనాల కోసం యుపి వాళ్లకు కాంట్రాక్టుకు ఇవ్వడమేమిటన్నారు.
దివంగత ప్రధానమంత్రి పివి నరసింహా రావుకు కాంగ్రెసు పార్టీ ఏ రోజూ విలువివ్వలేదనన్నారు. అతనిని విస్మరించడమే కాంగ్రెసు పని అన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి నియోజకవర్గంలో అత్యాచారం జరిగితే ఆమె స్పందించక పోవడం దారుణమన్నారు. సబితా రెడ్డి తాను స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమెను వెంటనే తొలగించాలన్నారు. అత్యాచారాలపై కమిటీలిచ్చిన రిపోర్టులను బిల్లు రూపంలో తీసుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఏర్పాటే తొలి శుభవార్త
ఈ ఏడాది తెలంగాణ ఏర్పాటు పైనే తొలి శుభవార్త వెలువడుతుందని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రేపిస్టులకు ఉరిపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తామన్నారు. తెలంగాణపై జెఏసి మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తెలంగాణ సమస్య జఠిలం అవుతుందన్నారు. తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలు చేసుకోవద్దన్నారు.












Click it and Unblock the Notifications