వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: రాంసింగ్‌ ఇంటిపై బాంబుదాడి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Delhiites tried to bomb gangrape accused's house, arrested
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలితో ఆగ్రహించిన కొంత మంది ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీలోని రాంసింగ్ ఇంటిపై బాంబు దాడి చేయడానికి కొంత మంది ప్రయత్నించారు. అందుకు ప్రయత్నించినవారిలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో వారి ప్రణాళిక బెడిసికొట్టింది. పోలీసులు సోమవారంనాడు 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి, రెండు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని రాజేష్‌గా గుర్తించారు.

దక్షిణ ఢిల్లీలోని ఆర్‌కె పురం ప్రాంతంలో గల రవిదాస్ మురికివాడలో సముదాయంలో ఉన్న రాంసింగ్ ఇంటి చుట్టూ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రాజేష్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు.

స్థానికులు కొత్తవాళ్లను చూసి ఏం పని మీద వచ్చారని అడిగారు. తాము రాంసింగ్‌ ఇంటిని పేల్చేయడానికి వచ్చినట్లు చెప్పారు. దాంతో ముగ్గురిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే రాంసింగ్ వారికి చిక్కగా మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు చెప్పారు.

ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ వైద్య విద్యార్థినిని ఆరుగురు రేప్ చేసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి గురైన 23 ఏళ్ల అమ్మాయి సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించింది. నిందితులను ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 29వ తేదీన అమ్మాయి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. సామూహిక అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగాయి.

English summary
ays after Delhi gang rape victim's death in a hospital in Singapore, angry Indians showed their wrath on the main accused Ram Singh. A group of men tried to bomb Ram Singh's house in a slam area in the national capital. However, their plan was foiled by police who later arrested one of them.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X