'అజ్ఞాతంలో పరిటాల శ్రీరామ్: విమానాశ్రయాల్లో నిఘా'

కాంగ్రెసు నేత హత్య కేసు కుట్రలో అతనిపై అభియోగాలు ఉన్నాయని చెప్పారు. శ్రీరామ్ పరారీలో ఉన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. సునీత, ఆమె బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీరామ్ విదేశాలకు వెళ్తారనే సమాచారం తమకు ఉందన్నారు. అతను విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు సమాచారాన్ని అందించినట్లు చెప్పారు. శ్రీరామ్‌ను ఏ క్షణమైనా పట్టుకుంటామని చెప్పారు.
మూడు బృందాలతో శ్రీరామ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అవసరమైతే కర్నాటకలోనూ సోదాలు నిర్వహిస్తామన్నారు. నేరస్తుల కోసం తనిఖీలు చేసే అధికారం తమకు ఉందన్నారు. నిందితుల సమాచారం మేరకే శ్రీరామ్ పైన అభియోగాలు ఉన్నాయన్నారు. కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. కాగా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిటాల శ్రీరామ్‌ను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రస్తుతానికి వెంకటాపురంలో సోదాలు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications