సెక్యులర్ పార్టీ: అక్బరుద్దీన్‌పై సిఎం, ఓయులోనూ కేసు

వ్యవస్థ అపహాస్యం
అక్బరుద్దీన్ వ్యాఖ్యల ద్వారా మజ్లిస్ పార్టీ వ్యవస్తను అపహాస్యం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. అజ్మల్ కసబ్ ఉరిని ప్రశ్నించడం దేశ ద్రోహమే అవుతుందన్నారు. అక్బరుద్దీన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. కోర్టులో జోక్యం చేసుకునే వరకు ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు.
నోటిని అదుపులో పెట్టుకోవాలి
అక్బరుద్దీన్ ఓవైసీ నోటిని అదుపులో పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. హిందువుల మనోభావాలు గాయపర్చేలా ఆయన వ్యాఖ్యానించారన్నారు. హిందూ - ముస్లిం మతాల మధ్య ఘర్షణలు పెట్టేలా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడిన అక్బరుద్దీన్ పైన వెంటనే కేసు పెట్టాలన్నారు. తమ్ముడిని ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
ఓయు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు!
నాంపల్లి కోర్టులో ఓ వైపు అక్బరుద్దీన్ పైన ఓ కేసు నడుస్తుండగానే మరో కేసు వేశారు. వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి అక్బరుద్దీన్ పైన కేసు పెట్టాలని కోర్టును ఆశ్రయించారు. అతను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వ్యక్తి. దీంతో నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ఓయు పోలీసులను ఆదేశించింది. అక్బర్ పైన ఐపిసి 153ఎ సెక్షన్ కింద కేసు నమోదు కానుంది. కాగా రెండు రోజుల క్రితం కరుణాకర్ అనే వ్యక్తి అక్బరుద్దన్ పైన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాని తీర్పు ఈ రోజు వెలువడనుంది. మరోవైపు షబ్నం హష్మి కూడా ఢిల్లీలో పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications