కెకె, కోమటిలపై పాల్వాయి ఫైర్: అక్బర్‌పై సిఎంకి సవాల్

ఇసుక దందా, బార్లు నడిపేది కోమటిరెడ్డియే అని ఆరోపించారు. కోమటిరెడ్డి తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు సిద్దపడ్డారని, అఖిల పక్ష సమావేశం తర్వాత ప్రజలు తిరగబడటంతో వెనక్కి తగ్గారని ఆయన విమర్శించారు. అందుకే ఇప్పుడు జగన్‌ను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితి జపం చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసమంటూ కోమటిరెడ్డి చేసింది ఉత్తుత్తి రాజీనామానే అన్నారు.
కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి కె కేశవ రావు ఇంత తెలివి తక్కువ పని చేస్తారని తాను భావించ లేదన్నారు. ఈ నెల 4వ తేదిన జరిగే తెలంగాణ ప్రాంత పార్టీ నేతల సమావేశంలో తాను కెకెను కడిగి పారేస్తానన్నారు.
దేశ ద్రోహులను ప్రాసిక్యూట్ చేయాలి
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను వెంటనే ప్రాసిక్యూషన్ చేయాలని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. అక్బర్ పైన ఇప్పటి వరకు కేసు పెట్టక పోవడం దారుణమన్నారు. శాంతిభద్రతలు కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి ధైర్యవంతుడై ఉండాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బర్ మాట్లాడారన్నారు.
ఉత్తమ్ వ్యాఖ్యలు బాధాకరం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని తెలంగాణే ముఖ్యమన్నారు. ఈ నెల 4న తెలంగాణపై చర్చించేందుకే భేటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications