కెసిఆర్‌కు చెక్: జగన్, చంద్రబాబులతో సిపిఐ దోస్టీ?

Chandrababu Naidu-K Narayana-YS Jagan
హైదరాబాద్: తెలంగాణ అనుకూల వైఖరిని ఆసరా చేసుకుని సిపిఐ తెలంగాణ ప్రాంతంలో విస్తరించడానికి మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చెక్ పెట్టడానికి ఇంత కాలం అంటరాని పార్టీగా భావించిన బిజెపితో కూడా జత కట్టేందుకు సిపిఐ సిద్ధపడినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఒంటెత్తు పోకడ పోతున్నారంటూ విమర్సిస్తున్న సిపిఐ కార్యదర్శి కె. నారాయణ స్వతంత్రంగా తెలంగాణపై ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

గురువారం జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ అంశం వరకు బిజెపితో జత కట్టాలనే కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సిపిఐ భావిస్తోంది. పైగా, కెసిఆర్ వాదనలను పక్కన పెట్టి తెలంగాణపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కూడా కలుపుకుని వెళ్లాలని సిపిఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణపై కాంగ్రెసు మీద ఒత్తిడి పెంచేందుకు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపిలను సమాయత్తం చేయాలనే ఆలోచనలో సిపిఐ ఉంది. కలిసి వస్తే తెరాసను కూడా తన ఉద్యమ కార్యాచరణలోకి తేవాలని అనుకుంటున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, తెరాసలతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లో తేలుస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో ఈలోగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై, ఒక వేళ ఈలోగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై కూడా ఓ ఆలోచన చేయాలని అనుకుంటోంది. తెలంగాణపై ఈలోగా ఇందిరా పార్కు వద్ద ఓ ధర్నా నిర్వహించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమైక్యవాదాన్ని వినిపించలేదు కాబట్టి తెలంగాణకు అనుకూలంగానే వ్యవహరించినట్లు భావించాలని సిపిఐ భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది. తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నారాయణ ఇంతకు ముందు అన్నారు. ఇదే సమయంలో విద్యుత్తు సమస్యపై వామపక్షాలతో కలిసి ఆందోళనలు చేపట్టాలని సిపిఐ అనుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+