ప్రభుత్వ కూల్చివేతకు యడ్యూరప్ప ప్లాన్

ప్రభుత్వానికి ప్రస్తుతం 116 మంది సభ్యుల బలం ఉంది. ఇప్పటికే తన వర్గానికి చెందిన ఇద్దరు శాసనసభ్యులతో యడ్యూరప్ప రాజీనామా చేయించారు. బడ్జెట్ సమావేశాల్లోగానే జగదీష్ షెట్టర్ ప్రభుత్వాన్ని కూల్చాలని యడ్యూరప్ప అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాలను తానే నిర్వహిస్తాననే దీమాను జగధీష్ షెట్టర్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తానని చేసిన సవాల్‌ను సత్తా చాటి నిరూపించుకోవాలని బిజెపి నాయకుడు అనంతకుమార్ యడ్యూరప్పకు ప్రతి సవాల్ విసిరారు.
తాము ఈ నెల 5వ తేదీన రాజీనామా చేస్తామని ఏడుగురు బిజెపి శానససభ్యులు ప్రకటింటారు. ఈ స్థితిలో యడ్యూరప్ప శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సమావేశానికి ఎంత మంది బిజెపి హాజరవుతారనేదానిపై జగదీష్ షెట్టర్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పైగా, శుక్రవారం 15 మంది బిజెపి శాసనసభ్యులు రాజీనామా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది.
జగదీష్ షెట్టర్ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసి కూల్చాలనే ప్రయత్నంలో యడ్యూరప్ప విజయం సాధిస్తారా, లేదా అనే విషయంపై శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చి ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేలా చూడాలనేది యడ్యూరప్ప ఆలోచనగా చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని యడ్యూరప్ప ఉవ్విళ్లూరుతున్నారు. దీంతోనే ఆయన వేగంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications