వైయస్ జగన్ పార్టీలోకి ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

గొట్టిపాటి రవికుమార్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు శానససభ్యులు కూడా ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు.
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుుడ, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలిశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు కారణంగానే జగన్‌ను జైలులో పెట్టారని మల్లెల లక్ష్మీనారాయణ జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో అన్నారు. ప్రజలు జగన్ వెంట ఉన్నారని, తాను కూడా ఆ పార్టీకోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.
జగన్ కోసం జనం సంతకం పేర కోటి సంతకాలు సేకరించాలనే లక్ష్యంలో భాగంగా విజయవాడకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గౌతం రెడ్డి లక్షకు పైగా సంతకాలు సేకరించారు. కేవలం మూడు రోజుల్లోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన సంతకాలు సేకరించారు. హైదరాబాదులోని లోటస్‌పాండులో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసి 1.06 లక్షల సంతకాలతో ఉన్న పత్రాలను అందించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications