కూతురిపై రేప్ వ్యక్తి యత్నం: భర్తను చంపిన భార్య

Man killed for attempted rape on daughter
కడప/ విశాఖపట్నం: ఈడుకొచ్చిన కూతురిపై కన్నేసి అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన కళ్ల ముందే కూతురి బతుకును నాశనం చేయడానికి ప్రయత్నించి భర్త కీచకత్వాన్ని భార్య సహించలేకపోయింది. ఆ కోపం పట్టలేక అతన్ని నరికి చంపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ సంఘటన జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి - ద్వారకానగర్‌కు చెందిన ఉమ్మడిశెట్టి సుబ్బరాయుడికి భార్య వెంకటేశ్వరమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్ిచన సుబ్బారాయుడు టీవీ చూస్తున్న కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. ఇది గమనించిన వెంకటేశ్వరమ్మ అర్థరాత్రి సమయంలో సుబ్బారాయుడి తలపై రోకలిబండతో మోదింది. ఆపై వేటకొడవలితో తలపై, మెడపై నరికింది.

ఇదిలావుంటే, హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులను సెక్స్ కూపంలోకి లాగిన వాచ్‌మన్ ఉదంతం వెలుగు చూసింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో ఈ సంఘటన జరిగింది. రెండు నెలల క్రితం నైట్ వాచ్‌మన్‌గా పనిచేసి విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి సింహాచలం బదిలీ అయింది. ఆమెను నాతవరం నుంచి రోటవురుట్ల హాస్టల్‌కు బదిలీ చేశారు.

నాతవరం హాస్టల్లో పనిచేస్తున్నప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థినులను వివిధ మార్గాల్లో లోబరుచుకుని గ్రామంలో పూర్వ విద్యార్థులతో అనైతిక సంబంధాలకు ప్రేరేపించి సింహాచలం డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం ముగ్గురు విద్యార్థినులు సింహాచలం బండారాన్ని బయటపెట్టారు. సింహాచలాన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+