అక్బరుద్దీన్ ఓవైసీ ఎపిసోడ్: వైయస్ జగన్‌కూ మచ్చ

అఖిల పక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని వినిపించిన మజ్లీస్ పార్టీని అడ్డం పెట్టుకుని జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. మతకల్లోలాలు సృష్టించడం జగన్ కుటుంబానికి కొత్త కాదని ఆయన అన్నారు. పలికింది అక్బరుద్దీనే అయినా పలికింది ఎవరనేది బయటకు రావాలని, కుట్ర కోణంలో కేసును దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు మజ్లీస్‌తో కుమ్మక్కయి మతం పేరుతో తెలంగాణలో చిచ్చు పెడుతోందని ఆయన కరీంనగర్‌లో విమర్శించారు. తన తండ్రి నుంచి వైయస్ జగన్ మతకల్లోలాలకు వారసత్వం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మజ్లీస్ పార్టీని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని కెటి రామారావు వ్యాఖ్యానించారు. మతాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణపై కేంద్రం తర్జనభర్జనలు పడుతున్న సమయంలో సీమాంధ్ర నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మతకల్లోలాలు రెచ్చగొట్టి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం అక్బరుద్దీన్ వ్యవాహారంలో దాగి ఉందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు కూడా విమర్శించారు. హైదరాబాదులో మతకల్లోలాలు ఎప్పుడు జరిగినా అది వలసవాదుల కుట్రేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు మతసామరస్యంగా ఉంటారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మజ్లీస్ వ్యవహారాన్ని మొదటి నుంచీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే అంటగడుతోంది. తెలంగాణను అడ్డుకుంటామని అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.












Click it and Unblock the Notifications