తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టొద్దు, మాతోమాట్లాడాకే: టిజి

తెలంగాణవాదులను ఎవరూ రెచ్చగొట్టవద్దని టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందని, పార్టీ అధిష్టానం తుది నిర్ణయం ఏం తీసుకున్నా రాయలసీమ ప్రాంత నేతలతో చర్చించి తీసుకోవాలని కోరారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయా ప్రాంతాల నేతలు ప్రజల అభీష్టం మేరకే నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తాను ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
కేంద్రం మరోసారి డిసెంబర్ 9లా తొందరపాటు ప్రకటన చేయవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు డిల్లీ నుండి పిలుపు రావడం సహజమే అన్నారు. కెసిఆర్‌కు నెలకోసారి ఢిల్లీ నుండి పిలుపు రావడం సహజమే అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి అవగాహన ఉందని చెప్పారు.
తాను సమైక్యవాదినేనని కాసు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు విడుదల చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని చెప్పారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. సహకార ఎన్నికలను రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము కోరామని శైలజానాథ్ అన్నారు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక రాయలసీమను తాము ఒప్పుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications