జైల్లో గాలి పుట్టిన రోజు, శివుడికి పూజ: జగన్ గ్రీటింగ్స్

Gali Janardhan Reddy-YS Jagan
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింక్ కంపెనీ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డి తన 45వ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో జరుపుకున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులోనే ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌తో పాటు పలువురు విఐపి ఖైదీలు గాలి జనార్దన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు అతనికి మిఠాయిలు తినిపించారు. తన నలభై అయిదవ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి జైలులో ఉన్న శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఓబుళాపురం మైనింక్ కంపెనీకి సంబంధించి అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.

అతను అరెస్టై సంవత్సరం దాటింది. అప్పటి నుండి అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే అతనికి బెయిల్ మాత్రం లభించలేదు. ఓ సమయంలో బెయిల్ కోసం పలువురుకి భారీ మొత్తంలో డబ్బులు కూడా ముట్టజెప్పిన అభియోగాలు ఉన్నాయి. దానిని సిఐడి తవ్వింది. బెయిల్ డీల్ కేసులో కూడా పలువురిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లభించలేదు.

మరోవైపు అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు పాలయ్యారు. ఆయన కంపెనీలలో పెద్ద మొత్తంలో పలువురు నాటి ప్రభుత్వం నుండి లబ్ధి పొంది పెట్టుబడులు పెట్టారనే అభియోగాలు ఉన్నాయి. జగన్ కేసుకు సంబంధించి జగన్‌తో పాటు పలువురు జైలు పాలయ్యారు. జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డి కూడా అరెస్టయ్యారు. అతను కొంతకాలం క్రితం బెయిల్ పైన విడుదలయి బయటకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+