పాతబస్తీ టెన్షన్ టెన్షన్: అక్బర్ ఫోటోతో ర్యాలీ, రాళ్ల వర్షం

శాంతియుతంగా ర్యాలీ చేసుకోవచ్చునని పోలీసులు చెప్పారు. అయితే ఆందోళనకారులు మాత్రం పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పలు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ చిత్రపటంతో వారు ర్యాలీ తీసే ప్రయత్నాలు చేశారు. శాంతియుతంగా చేస్తేనే అనుమతిస్తామని చెప్పిన పోలీసుల మాటలు ఆందోళనకారులు పట్టించుకోలేదు. పోలీసుల పైన, వాహనాల పైన రాళ్లు రువ్వడమే కాకుండా వాహనదారుల పైన దాడి యత్నం చేశారు.
దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అక్కడనే భారీగా మోహరించారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఇద్దరు ఫోటో గ్రాఫర్లు, పలువురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
ఆందోళనకారులు చార్మినార్ దగ్గర్లోని భాగ్యలక్ష్మి ఆలయం వైపుకు రాకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెను, బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అటువైపు ఆందోళనకారులు రాకుండా చూశారు.












Click it and Unblock the Notifications