మహాత్ముడు.., మోడీ: సిఎంపై అంబానీల ప్రశంసల జల్లు

మోడీ గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు అని ఆయన నాయకత్వంలో గుజరాత్ మౌలిక వసతుల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ముఖేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో రూ.500 కోట్లతో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అతని సోదరుడు అనిల్ అంబానీ కూడా మోడీని ఆకాశానికెత్తేశారు. మోడీ రాజులకే రాజు(కింగ్ ఆఫ్ కింగ్) అని కొనియాడారు.
భారతంలో అర్జునుడిలా మోడీ స్పష్టమైన దృక్పథం ఉన్న నేత అన్నారు. ఇలాంటి నేత నాయకులకే నాయకుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ, నరేంద్ర మోడీలాంటి మహానేతలు జన్మించిన నేల గుజరాత్ అని అనిల్ అంబానీ అన్నారు. కాగా పారిశ్రామికవేత్తల పెట్టుబడుల కోసం గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వైబ్రాంట్ గుజరాత్ నిర్వహించడం ఇది ఆరోసారి.
గత ఏడాది నిర్వహించిన వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకు వచ్చాయి. ఈసారి గతంలోకంటే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది మరో రెండు రోజుల పాటు జరుగనుంది. రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, ఆది గోద్రేజ్, చందా కొచ్చార్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications