ఫిబ్రవరిలో మళ్లీ షర్మిళ పాదయాత్ర, విడుదలైతే జగన్

'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేస్తున్న సమయంలో గత డిసెంబరు 14వ తేదీన ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బస్సు దిగుతున్న షర్మిళ గాయపడ్డారని తెలిపారు. మొదట్లో గాయం తీవ్రత గుర్తించలేకపోయామన్నారు. దీంతో రెండురోజుల్లో నొప్పి ఎక్కువ కావడంతో ఎంఆర్ఐ స్కాన్ చేసినపుడు మోకాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామనీ, డిసెంబరు 19న ఆపరేషన్ నిర్వహించామన్నారు.
ఆపరేషన్ తరువాత ఆరువారాల విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించిందని తెలిపారు. ప్రస్తుతం ఫిజియోథెరఫీ నిపుణుల సాయంతో షర్మిళ కోలుకుంటన్నారనీ, మూడువారాల తరువాత మరోమారు స్కానింగ్ చేసి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు షర్మిళ పాదయాత్ర పునఃప్రారంభమవుతుందన్నారు.
ఈలోగా జగన్ జైలు నుంచి విడుదలైతే, ఆయనే పాద యాత్ర కొనసాగిస్తారని తెలిపారు. పార్టీ వైద్య విభాగం తరపున ఇప్పటికే పలు వైద్య శిబిరాలు నిర్వహించామనీ, అవసరమైతే రాష్ట్రేతర తెలుగు ప్రాంతాలలో కూడా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని డాక్టర్ శివభరత్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications