త్వరలో చలో హైదరాబాద్: కోదండ, వంద రోజుల సమ్మె

కాగా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రేపు ఆదివారం తెలంగాణ జెఎసి నేతలు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే యుపిఎ భాగస్వామ్య పక్షాల నేతలు ఎవరూ అందుబాటులో లేనందున ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్లు కోదండరాం చెప్పారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలను కలిసే పనిని ఢిల్లీ జెఎసి చూసుకుంటుందని ఆయన చెప్పారు.
ఈనెల 18న జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ మేధోమథన సదస్సు దృష్ట్యా ఆ పార్టీ నేతలకు తీరిక లేదని, దాంతో 17వ తేదీన నిరసనలు మాత్రమే చేపట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ముందుగా ప్రకటించినట్టు ఈనెల 27న భారీ బహిరంగ సభకు బదులు దీక్ష చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దీనిపై ఆదివారం జరుగబోయే సమావేశంలో దీక్ష కార్యక్రమాలు విధివిధానాలను చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications