యువతతో ప్రచారమా?, సారీ చెప్పు: బాబుపై కాంగ్రెస్

అప్పటి తప్పులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో బాబు తన వద్దకు వచ్చిన పలు సమస్యల పైన ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసమే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష పాత్ర కూడా దక్కదని మండిపడ్డారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు.
కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి నైతిక విలువలు ఉంటే శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అవిశ్వాసం పెడితే దానిని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. భయపడుకుంటూ పరిపాలన సాగించలేరన్నారు. తాము దేనికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో భాగంగానే జగన్ పార్టీ సంతకాల సేకరణ జరుపుతోందన్నారు.
యువతచే దుష్ప్రచారం
చంద్రబాబు అధికారం కోసం యువతచే దుష్ప్రచారం చేయించే ప్రయత్నాలకు తెరతీశారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఎస్సెమ్మెస్‌లు పంపించాలన్న బాబు సూచన పైన ఆయన ఆదివారం ధ్వజమెత్తారు. బాబును ప్రస్తుతం ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా యువత కూడా నమ్మే ప్రసక్తి లేదన్నారు. యువతచే దుష్ప్రచారం చేయించే స్థితికి ఆయన దిగజారారన్నారు.
సీమాంధ్రుల తీరు గర్హనీయం
తెలంగాణ ఇవ్వకుంటే రాష్ట్రంలో 274 ఎమ్మెల్యే, 38 ఎంపీ సీట్లు గెలుస్తామని అధిష్టానానికి సీమాంధ్ర నేతలు చెప్పడం దురదృష్టకరమని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో అన్నారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications