వైయస్ బొమ్మతో గెలిచా, బాబును తరిమేస్తాం: జోగి

తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారని, అందువల్ల తాము కృష్ణా జిల్లాలో ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన టిడిపి అధినేతను తాము జిల్లాలోకి రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. తాము సమైక్యవాదులమని ఇన్నాళ్లు చెప్పిన సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు గాజులు తొడుక్కొని కూర్చున్నారా అని ప్రశ్నించారు.
కాగా పక్షం రోజుల క్రితం జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్రలో మాత్రం టిటిడిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు ఏమీ మాట్లాడటం లేదని చెప్పవచ్చు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మాత్రం సీమాంధ్ర టిడిపిని విమర్శిస్తున్నారు.
కాగా సిఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర నేతలు ఆదివారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి, మంత్రులు శైలజానాథ్, వట్టి వసంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణపై తాము ఇప్పటికే తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పామని శైలజానాథ్ అన్నారు. పండుగ తర్వాత మరోసారి భేటీ అవుతామన్నారు.












Click it and Unblock the Notifications