నారావారిపల్లెకు నందమూరి ఫ్యామిలీ: ఖమ్మంలో బాబు

హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ, భార్య వసుందర, తనయుడు మోక్షజ్ఞ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి,తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మరో తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ కూతుళ్లు లోకేశ్వరి, ఉమామహేశ్వరి తదితరులు అందరూ ఈ సంక్రాంతి ఉత్సవాలను నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు.
శనివారం రాత్రి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, గంగిరెద్దులాటలతో కోలాహలం నెలకొంది. గ్రామంలోని పెద్దలు, ప్రముఖులకు బాలకృష్ణ దంపతులను లోకేష్ పరిచయం చేశారు. చిన్నాన్న, పెద్దనాన్న, మామయ్య అంటూ పలకరిస్తూ కరచాలనం చేశారు. చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో ఆయన ఖమ్మం జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
కాగా పుంగనూరులో బాలకృష్ణ సోమవారం స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎన్ రామకృష్ణా రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేత శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటినే రేపు బాలయ్య ఆవిష్కరిస్తారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications