జగన్ నిర్దోషి, చేతులెత్తి దండం: విజయమ్మ కంట నీరు

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ 96 లక్షల సంతకాలు సేకరించామని చెప్పారు. సమయాభావం వల్ల కోటి 56 లక్షల సంతకాలను మాత్రమే తాము రాష్ట్రపతికి ఈ రోజు సాయంత్రం సిడిల రూపంలో అందజేయనున్నట్లు చెప్పారు. జగన్ విడుదల కోసం సంతకాలు చేసిన అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానని ఆమె చెప్పారు. సంతకాల రూపంలో జగన్‌కు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు అన్నారు.
వైయస్ జగన్ అధికారంలోకి వస్తే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ యుగాన్ని తీసుకు వస్తారన్నారు. సంతకాల సేకరణకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. తన బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారన్నారు. దేవుడు అంతా చూస్తున్నాడన్నారు. జగన్ నిర్దోషి అని సంతకాల ద్వారా ప్రజాకోర్టులో తేలిందని విజయమ్మ అన్నారు.
వైయస్ మరణం తర్వాత తమ కుటుంబానికి ప్రజలు పెద్ద ఎత్తున అండగా నిలబడుతున్నారన్నారు. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎవరి కోసం సంతకాలు చేసిన సందర్భాలు లేవని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ తన తనయుడుని తల్చుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాగా ఈ భేటీలో ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం వారు ఢిల్లీ వెళ్లేందుకు కార్యాలయం నుండి బయలుదేరారు.












Click it and Unblock the Notifications