వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి అడ్డుకునే యత్నం: టి-ఎంపీలు, చిరంజీవికి సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajaiah-Madhu Yashki
న్యూఢిల్లీ: గతంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో వాటిని అడ్డుకున్న సందర్భాలు లేవని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ బుధవారం అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రాంత ఎంపీలు యాష్కీ, రాజయ్య తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము సామాజిక తెలంగాణ కోరుకుంటున్నామని, తెలంగాణ దిశగా ప్రయత్నాలు సాగుతున్న తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు.

గతంలో తెలంగాణను కెవిపి రామచంద్ర రావు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలిసి మరోసారి ఆయన తెర వెనుక పావులు కదుపుతున్నాడని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కెవిపిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకునేందుకు విషయంలో గతంలో కెవిపిదే స్క్రీన్ ప్లే అన్నారు.

తెలంగాణ అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలన్నారు. అక్కడి ప్రజలు వ్యతిరేకంగా లేరన్నారు. సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ అంశంపై ఏడుస్తున్నారని, ఆయన ఏడవాల్సిన అవసరం లేదన్నారు. గంటాను ఓదార్చాలని తాము కేంద్రమంత్రి చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అయితే రెచ్చిపోతున్నాడన్నారు. ఆయన అనంతపురం నుండి వచ్చినందు వల్ల ఆ ప్రాంత వాతావరణాన్ని బట్టి అలా మాట్లాడుతున్నారేమో అన్నారు. మొదట తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆశాజీవిని

తాను ఆశాజీవినని తెలంగాణ వస్తుందనే ఆశ తనకు ఉందని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దన్నారు. తాను అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు.

English summary
Telangana MPs were alleged that KVP Ramachandra Rao is chalked out conspiracy against Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X