ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బరుద్దీన్ విచారణకు సహకరించలేదా: మళ్లీ కస్టడీకి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అదిలాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని విచారణ నిమిత్తం ఐదు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు మరో రోజు మిగిలి ఉండగా బుధవారం వేకువజామున ఐదున్నర గంటలకే అతనిని నిర్మల్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. విచారణ పూర్తయిందని కోర్టుకు చెప్పారు. దీంతో న్యాయమూర్తి అతనిని భారీ బందోబస్తు మధ్య అదిలాబాద్ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించారు. అతనిని జైలుకు తరలించారు.

అయితే అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల కస్టడీలో వారికి ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. అక్బర్ విచారణకు సహకరించక పోవడంతో అవసరమైన సమాచారాన్ని సేకరించి తిరిగి అతనిని కోర్టుకు అప్పగించినట్లుగా చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న సిడిల్లోని గొంతు తనది కాదని అతను పోలీసులకు చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశమే ప్రధానమైనదని కావడంతో పోలీసులు అతని గొంతేనా కాదా తేల్చుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

కస్టడీలో అక్బర్ నుండి పూర్తి సహకారం లేదనందున ఆయన శ్యాంపిల్స్ ఛండీగఢ్‌కు పంపి, రిపోర్ట్స్ వచ్చాక తిరిగి మరోసారి అక్బరుద్దీన్ కస్టడీని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శ్యాంపిల్స్‌ను పరీక్షల కోసం ఛండీగఢ్‌కు పంపించేందుకు అనుమతించాలని ఇప్పటికే పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిపోర్ట్‌ను ఆధారంగా మరోసారి అక్బర్‌ను విచారించే అవకాశముంది.

అక్బరుద్దీన్ రిమాండు డైరీలోనూ ఇవే ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్బర్ విచారణకు సహకరించలేదని, పదవి అడ్డు పెట్టుకొని తప్పించుకునే అవకాశముందని, అక్బర్ విచారణకు సహకరించనందనే అరెస్టు చేశామని, వివాదాస్పద ప్రసంగంపై ఎన్నిసార్లు ప్రశ్నించిన సరైన సమాధానం చెప్పలేదని, హోదా, రాజకీయం అడ్డుపెట్టుకొని తప్పించుకునే అవకాశముందని, విచారణ నుండి తప్పించుకునేందుకు అనారోగ్య సాకులు చూపిస్తున్నారని రిమాండు డైరీలో పేర్కొన్నారు.

కాగా వాయిస్ రికార్డ్ నిర్ధారణ కోసం పోలీసులు వేసిన పిటిషన్ పైన అక్బరుద్దీన్ తరఫు న్యాయవాదులు బుధవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న పిటిషన్ పైన విచారణ ఈ రోజు జరగనుంది. అదే సమయంలో అక్బర్‌కు ఉన్నతస్థాయి వైద్య సేవలు అందించాలని అతని తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

English summary
It is said that Adilabad district police may again appeal in the district court for MIMLP Akbaruddin Owaisi's remand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X