వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ ఏర్పాటు అవాస్తవం: విభజనతో నీటి సమస్య'

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy - TG Venkatesh
న్యూఢిల్లీ/విజయవాడ/కడప: రాష్ట్ర విభజన అంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బుధవారం వేర్వేరుగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కృష్ణా జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు విజయవాడలో అన్నారు. గురువారం జరగనున్న సమైక్యాంధ్ర సమావేశం తప్పకుండా నిర్వహించి తీరుతామన్నారు. సమావేశానికి ఎవరి అనుమతి అక్కర్లేదన్నారు.

తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కడప జిల్లాలో అన్నారు. రాష్ట్ర విభజన అంటూ జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తన ఓటు సమైక్యవాదానికే అని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తెలంగాణ రావొచ్చు.. రాకపోవచ్చు.. కానీ తాను సమైక్యవాదినే అన్నారు. సమైక్యవాదంపై ప్రజల్లో స్పందన లేనప్పుడు ఎంతమంది రాజీనామా చేసినా వృథానే అన్నారు.

మా ప్రాంత ప్రజల మనోభావాలు చెప్పేందుకే

తమ ప్రాంత మనోభావాలను తన పార్టీ అధిష్టానానికి చెప్పేందుకే తాము వచ్చామని మంత్రులు టిజి వెంకటేష్ ఏరాసు ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్, కాసు వెంకట కృష్ణా రెడ్డిలు ఢిల్లీలో అన్నారు. సమైక్య గళం వినిపించేందుకు వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలని అధిష్టానానికి వినిపిస్తామన్నారు.

సమైక్య రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇక రాష్ట్ర విభజన జరిగితే నీటి సమస్యలు ఇంకా పెరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. సీమాంధ్ర నేతల సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు.

English summary
Seemandhra leaders like DL Ravindra Reddy and Malladi Vishnu are saying that rumors on Telangana are false.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X