ధిక్కరించొద్దు: శంకరన్న, అందరూ యు-టర్న్: వీరశివా

తామంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాస రావు కాంగ్రెసు పార్టీకి చేసిందేమీ లేదన్నారు. ఆయన ఏ గాలికి వచ్చాడో అదే గాలికి పోతాడన్నారు. తెలంగాణ కోసం యువకులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని శంకర రావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేది లోగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం చెప్పిందని, తెలంగాణ వస్తుందనే ఆశాభావం అతను వ్యక్తం చేశారు.
ఊహాగానాలే
కేంద్రం తెలంగాణ ఇస్తుందని తాను అనుకోవడం లేదని కేంద్రమంత్రి పళ్లం రాజు బుధవారం వేరుగా అన్నారు. తెలంగాణ వస్తుందనే ప్రచారం కేవలం ఊహాగానాలే అన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అన్నారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నిధులు ఎక్కువగా వస్తాయని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రం ఒక్కటిగా ఉంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు పేరు రావడంతో పాటు లబ్ధి కలుగుతుందన్నారు.
విభేదిస్తాం
అఖిల పక్ష సమావేశంలోని నిర్ణయానికి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండరని కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అన్నారు. అర్ధరాత్రి నిర్ణయాలతో విభజన వద్దని ఆయన కేంద్రానికి సూచించారు. విభజించే పరిస్థితి వస్తే రాష్ట్రాన్ని ఎలా కలిపారో అలాగే తీర్మానంతో విభజించాలన్నారు. జగన్ నిర్ణయానికి ఆ పార్టీ నేతలు, చంద్రబాబు నిర్ణయానికి ఆయన పార్టీ నేతలు కట్టుబడి ఉండరన్నారు.
తాము కూడా అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ధిక్కరిస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తే టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు నేతలు యూ టర్న్ తీసుకుంటారన్నారు. అఖిల పక్షంలో నాయకుల అభిప్రాయాలు కాకుండా పార్టీ అధినేతల అభిప్రాయాలు తీసుకుంటే మంచిదన్నారు. అఖిల పక్షం నిర్ణయాలతో అందరూ విభేదిస్తున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిప్రాయం అన్నారు.












Click it and Unblock the Notifications