జగన్ జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు, కోర్టుకు ధర్మాన

ఇదిలావుంటే, వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన మంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ సస్పెన్షన్‌కు గురైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్‌పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి అరెస్టయిన విషయం తెలిసిందే. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, చికిత్స నిమిత్తం కోర్టు శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్‌ను ఇంతకు ముందు మంజూరు చేసింది.
కాగా, గాలి జనార్దన్ రెడ్డిని కర్ణాటకలోని బళ్లారికి తరలించే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. శాంతిభద్రత కారణాలతో ఆయనను బళ్లారికి తరలించడాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఓ పరువు నష్టం దావా విషయంలో గాలి జనార్దన్ రెడ్డిని బళ్లారి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అందుకు ఆయనను గురువారం బళ్లారి తరలించారని అనుకున్నారు.












Click it and Unblock the Notifications