ఓట్లు, సీట్లతో రాష్ట్రాన్ని విభజిస్తారా: అంబటి ప్రశ్న

రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెసు పార్టీయేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర విభజనపై ప్రజలను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు గందరగోళానికి గురి చేస్తున్నారని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండు పార్టీల నాయకులు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు హైదరాబాదులో డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అన్ని ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని వారు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధిష్టానం నాయకులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే కలిసి రాష్ట్ర విభజనపై ఎలా నిర్ణయం తీసుకుంటారని శ్రీనివాసులు అడిగారు.
సీమాంధ్రలో ఉద్యమం లేదనే వాయలార్ రవి వ్యాఖ్యలను శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీ శానససభ్యుడు గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications