జగన్, బాబు సెల్ఫ్ గోల్: బైరెడ్డి, వారిద్దరిపై ఒత్తిడి: శైలజ

తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు వేసిన వలలో చిక్కుకుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజనపై, సమైక్యంపై రాష్ట్రంలో రెఫరెండం నిర్వహించాలని, విభజన రాయలసీమ ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామని ఆయన చెప్పారు. తాము ఇన్నాళ్లూ నష్టపోతూ వచ్చామని, ఇక నష్టపోదలుచుకోలేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకులను కాంగ్రెసు అధిష్టానం నాయకులు వాయలార్ రవి, గులాం నబీ అజాద్ తిట్టి పంపించారని, తెలంగాణ నాయకులను చూసైనా సీమాంధ్ర నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయకపోతే పార్టీలను, నాయకులను ప్రజలు నిలదీస్తారని ఆయన చెప్పారు. రాయలసీమను, ఆంధ్రను కలిపి మరో రాష్ట్రం ఏర్పాటు చేస్తే మరో ఉద్యమం చెలరేగుతుందని ఆయన అన్నారు.
కాగా, సమైక్యం కోసం చివరి దాకా పోరాటం చేస్తామని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు వారి నాయకులు జగన్, చంద్రబాబులపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా ముందుకు కదలాలని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిలపక్షానికి వెళ్లిన తమ పార్టీ నాయకుడు గాదె వెంకటరెడ్డి సమైక్యం కోసం పత్రం సమర్పించారని చెప్పారు.
మంత్రి గంటా శ్రీనివాస్ నివాసంలో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశం తర్వాత శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకునే హక్కు తమకు ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications