వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పిచ్చోడిలా మాట్లాడుతున్నారు: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: సమస్యలు వస్తాయని రాష్ట్ర విభజనను అడ్డుకుంటారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రశ్నించారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన పార్టీ ధర్నా కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఆగ్రహావేశాలు పొడసూపుతున్నాయని మొదట గుర్తించింది తమ పార్టీయేనని ఆయన అన్నారు.

మంత్రి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీ పెట్టేవారు కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిచ్చోడిలా మాట్లాడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెరాస పుట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ తెలంగాణలో వేలాది మంది అత్మబలిదానాలకు కారణమైందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆషామాషీ కాదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ అనుకూల వైఖరే కనిపించిందని ఆయన చెప్పారు.

తెలంగాణను అడ్డుకునేందుకు తుది వరకు ప్రయత్నాలు జరుగుతాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను ఐక్యంగా తిప్పి కొట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు.

ఇంతకాలం తెలంగాణ అంశాన్ని నాన్చిన ఘటన కాంగ్రెసు పార్టీదేనని ఆయన విమర్శించారు. తెలంగాణను అడ్డుకునే ప్రతిపాదనలకు ఇప్పుడు కాలం చెల్లిందని ఆయన అన్నారు. స్వరాష్టం కోసం వేల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాతనే కేంద్రంలో కదలిక వచ్చిదని ఆయన అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం, దోపిడీ పాలన అంతం కోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర తమ పార్టీకి ఉందని ఆయన చెప్పారు.

English summary

 CPI state secretary K Narayana has refuted Telugudesam president Nara Chandrababu Naidu commebts against Telangana Rastra Samithi (TRS) president K Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X