వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు సమైక్య సెగ: జగన్ పార్టీకి ఎమ్మెల్సీ బొడ్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమైక్యాంధ్ర సెగ తగులుతోంది. తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు ఒక్కరొక్కరే చంద్రబాబుకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. తాను సమైక్యవాదం కోసం నిలిచే పార్టీలో చేరి, సమైక్యవాదం కోసం పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్ర విమర్శలు చేసిన బొడ్డు భాస్కర రామారావు తాను ఏ పార్టీలో చేరేది మాత్రం చెప్పలేదు. సమైక్యవాదానికి అండగా నిలిచే పార్టీలో చేరుతానని మాత్రమే చెప్పారు. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ వల్లనే తెలంగాణకు అనుకూలంగా పరిస్థితులు మారాయని బొడ్డు భాస్కర రామారావు విమర్శించారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని వినిపించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే కోరే విషయంలో చంద్రబాబు తొందర పడ్డారని, చంద్రబాబు లేఖ కారణంగానే రాష్ట్ర విభజనకు అనుకూలంగా పరిస్థితి మారిందని విమర్శించారు. యనమల రామకృష్ణుడిపై కూడా ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడానికే యనమల రామకృష్ణుడు ప్రజలను మభ్య పెట్టేందుకే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవరు కూడా సీమాంధ్ర నాయకుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని బొడ్డు భాస్కర రామారావు అన్నారు.

ఇదిలావుంటే, హైదరాబాదుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధీష్ రాంభొట్ల మరోసారి గొంతు విప్పారు. హైదరాబాదులో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఒక్క ఓటు వేసినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన శనివారం చెప్పారు. హైదరాబాదు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మట్టి కొట్టుకుపోతారని ఆయన అన్నారు. హైదరాబాదును దృష్టిలో పెట్టుకుని విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

హైదరాబాదులో రెఫరెండం పెట్టాల్సిందేనని, అవసరమైతే రాజకీయాల్లో రెఫరెండాన్ని పక్కన పెట్టవద్దని ఆయన అన్నారు. తాను తెలంగాణను అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సానుకూలం చేయడానికే తాను హైదరాబాదు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రెఫరెండం ప్రభుత్వ బాధ్యత కూడా అని ఆయన అన్నారు.

English summary
Opposing his party president Nara Chandrababu Naidu's stand on Telangana, Telugudesam party MLC Boddu Bhaskara Ramarao has abbounced to quit party for Unified Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X