వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల శ్రీరామ్‌కు రిలీఫ్: విదేశీ చదువుకు కోర్టు ఓకే

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Sriram
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌కు శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెసు నాయకుడు సుధాకర్ రెడ్డిపై హత్యాప్రయత్నం కేసులో ఆయన శనివారం ధర్మవరం కోర్టులో హాజరయ్యారు. విద్యాభ్యాసం కోసం సింగపూర్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

పరిటాల శ్రీరామ్ అభ్యర్థనకు స్పందించిన కోర్టు రూ. 50వేల పూచీకత్తుతో సింగపూర్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సింగపూర్‌లో విద్యాభ్యాసం చేసేందుకు మూడు నెలలకు శ్రీరామ్‌కు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పరిటాల శ్రీరామ్‌కు జనవరి 9వ తేదీన ముందస్తు బెయిల్ లభించింది. ముందస్తు బెయిల్ లభించే వరకు ఆయన అజ్ఢాతంలోనే ఉన్నారు. పరిటాల శ్రీరామ్ జనవరి 10వ తేదీన పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయన మధ్యాహ్నం ధర్మవరం రూరల్ పోలీసుల ముందు హాజరయ్యారు. అతను ఇద్దరు వ్యక్తులు, ఇరవై అయిదు వేల రూపాయల పూచీకత్తు పోలీసులకు సమర్పించాడు. శ్రీరామ్‌కు శివశంకర్, వెంకట నారాయణలు జామీను ఇచ్చారు.

కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో పరిటాల శ్రీరామ్‌తో పాటు పదిహేను మందిపై ధర్మవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనిపై పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని పరిటాల శ్రీరామ్ లొంగిపోయిన తర్వాత అన్నారు. తాను ఎవరికీ భయపడబోనని కూడా అన్నారు.

English summary
Ananthapur district Dharmavaram court allowed Telugudesam party MLA Paritala Sunitha's son Paritala Sriram to go Singapore dor studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X