తీవ్రవాదిలా కోదండరామ్, జైలు తప్పదు: టిజి వెంకటేష్

కోదండరామ్ వ్యాఖ్యల వల్ల ముందు ముందు అంతర్యుద్ధాలు వచ్చే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలులో శుక్రవారం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కోదండరామ్‌పై చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబించడం విచారకరమని, ఇక ముందు హెచ్చరికలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. వేర్పాటు ఉద్యమాల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే సీమాంధ్ర, తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు శత్రువులుగా మారారని ఆయన అన్నారు.
విభజనల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా రాజకీయ పార్టీలు ఓటుపరంగా ఆలోచించడం సర్వసాధారణమని టిజి వెంకటేష్ అన్నారు. అయినప్పటికీ తెలంగాణపై 28న ప్రకటన వెలువడకపోవచ్చనని అన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడలేదని చెప్పారు.
వారిని నిలుపుకొనేందుకైనా పార్టీ ఆలోచిస్తుంది కదా..? అని ప్రశ్నించారు. తాను మాత్రం సమైక్యాంధ్ర వాదానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణవాదం వైపు మొగ్గు చూపుతున్న భావనలు ఢిల్లీలో వెలువడినందున వారి మైండ్‌సెట్ మార్చేందుకు 21, 22 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్‌ను ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని హైదరాబాద్ అందరి సొత్తని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి కష్టంతోనే అది అభివృద్ధి చెందిందని గుంటూరు జిల్లా వినుకొండలో ఆమె అన్నారు.
ఇవాళ హైదరాబాద్ తమదని తెలంగాణ నేతలు అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక తెలంగాణ వద్దని కేంద్రానికి సూచించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది రాజధానిలో జీవనం సాగిస్తున్నారని, తెలంగాణలో దానిని కలిపితే వారికి భద్రత ఉండదన్నారు.












Click it and Unblock the Notifications