చిరు కోటాలో పదవికొట్టేసి: గంటాపై కోమటిరెడ్డి, బాబుపై..

వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడును ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబు కోమటిరెడ్డి సోదరులపై ఆరోపణలు చేశారు. దానిపై ఆయన స్పందించారు. మౌలికా సదుపాయాల కల్పన మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ ప్రకటిస్తే రాజీనామా చేస్తానని హెచ్చరించడం సరికాదన్నారు. కేంద్రమంత్రి చిరంజీవే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నారని కోమటిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడే సమయంలో సమైక్యాంధ్ర అంటూ కృత్రిమ ఉద్యమానికి తెరలేపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిరంజీవి కోటాలో మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాస రావు తెలంగాణపై అవాకులు చవాకులు పేలడం శోచనీయమన్నారు. సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకోవద్దన్నారు.
తెలంగాణపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆయన తనయుడు రాహుల్ గాంధీ వెనక్కి తగ్గితే తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మరన్నారు. కాంగ్రెసు వైఖరి కారణంగానే తెలంగాణలో వెయ్యిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఈ ప్రాంత మంత్రులంతా రాజీనామా చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications