మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింఘాల్: కోర్టులో లొంగిపోయిన అసద్, 2 వరకు జైలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
మెదక్: 2005లో మెదక్ జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో అసదుద్దీన్ ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లో పరారీలో ఉన్నట్లుగా చూపించారు. ఈ రోజు ఆయన లొంగిపోయారు. కోర్టు అతనికి ఫిబ్రవరి 2వ తేది వరకు రిమాండ్ విధించింది. అసద్‌ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పైన విచారణ రేపటికి వాయిదా పడింది.

కాగా 2005లో అక్బరుద్దీన్ ఓవైసీ ఓ అంశానికి సంబంధించి అప్పటి జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించారనే అభియోగాలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అక్బరుద్దీన్, అసదుద్దీన్‌లు అప్పట్లో ఓసారి సంగారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. మళ్లీ హాజరు కాలేదు. అయితే పటాన్‌చెరు పోలీసులు ఇప్పుడు ఆ కేసును తిరగదోడారు. బుధవారం పోలీసులు సంగారెడ్డి కోర్టులో పిటీ వారెంట్ దాఖలు చేశారు.

అక్బరుద్దీన్‌ను ఇక్కడకు తీసుకు వచ్చి విచారించేందుకు అనుమతించాలని కోరారు. రేపు అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చనున్నారు. 2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా మందిరాన్ని తొలగించినందుకు యత్నించిన అధికారులను ఓవైసీ సోదరులు అడ్డుకున్నారని కేసు నమోదయింది. కలెక్టర్‌ను, జెసిని అక్బర్ దుర్భాషాలాడారు. వారిపై 163ఏ, 147, 149, 341 సెక్షన్ల క్రింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించి అక్బర్ ఓసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు. అక్బర్ మరోసారి కోర్టుకు రాకపోవడంతో వారెంట్ పెండింగులో ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ అరెస్టు కావడంతో పటాన్‌చెరు పోలీసులు పాత కేసును తిరగదోడారు. పోలీసుల పిటీ వారెంట్‌తో ఈ నెల 17న అక్బరును సంగారెడ్డి కోర్టుకు తీసుకు వచ్చారు.

ఆ తర్వాత కేసు వాయిదా పడింది. నాటి కేసులో అక్బరుద్దీన్ ఎ1గా, అసదుద్దీన్ ఎ2గా ఉన్నారు. రెండున్నరేళ్ల క్రితం నలుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు కోర్టులో లొంగిపోయారు. ఇప్పటి వరకు 24 మంది ఈ కేసుకు సంబంధించి అరెస్టయ్యారు. ఓవైసీ సోదరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చూపారు.

పాతబస్తీ బందుకు పిలుపు

అసద్ అరెస్టు నేపథ్యంలో మజ్లిస్ పార్టీ పాతబస్తీ బందుకు పిలుపునిచ్చింది. దారుసలాం, మల్లెపల్లి తదితర ప్రాంతాల్లో దుకాణాలు బంద్ అయ్యాయి.

English summary
MIM chief and Hyderabad MP Asaduddin Owaisi has attended before Sanga Reddy court on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X