వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు యువత అధ్యక్షుడిగా నారా లోకేష్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగు యువత అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నియమితులయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఎఐసిసి ఉపాధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించడానికి నారా లోకేష్‌కు యువత పగ్గాలు అప్పంచే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను పదవులు కోరుకోవడం లేదని, పార్టీ సామాన్య కార్యకర్తగా పనిచేసి, యువతను సమీకరించే ప్రయత్నాలు చేస్తానని నారా లోకేష్ తమతో అన్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల పట్ల అనాసక్తి ప్రదర్శించిన నేపత్యంలో తెలుగు యువత పగ్గాలు నారా లోకేష్‌కు అప్పగించడానికి ఆంటకాలు తొలిగిపోయినట్లు భావిస్తున్నారు. మార్చి 27వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున చంద్రబాబు పాదయాత్ర ముగిసే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో నారా లోకేష్‌ను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబు ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

అన్ని పార్టీల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచన సాగుతోంది. నారా లోకేష్ ద్వారా యువతను పార్టీలోకి సమీకరించే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో దివంగత నేత ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడికి లోకసభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా పార్టీలో చురుగ్గా పని చేయడానికి ముందుకు వచ్చారు. అయితే, అనూహ్యంగా శ్రీరామ్‌కు కేసుల రూపంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా తెలుగుయువత చురుగ్గా పనిచేయడం లేదు. దాంతో నారా లోకేష్‌కు తెలుగు యువత నాయకత్వాన్ని అప్పగిస్తే యువతను ఆకర్షించవచ్చునని భావిస్తున్నారు.

English summary
According to news reports - The elevation of Rahul Gandhi as Congress vice-president seems to have inspired Telugu Desam president N. Chandrababu Naidu to name his son Lokesh as the party’s youth wing president, TD sources have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X