వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట-తుటా:లగడపాటి హౌస్‌అరెస్ట్: టిడిపిలోకిఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu
విజయవాడ/నల్గొండ: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కనువిప్పు కలిగేలా వినూత్న కార్యక్రమం చేపడతామని, తమకు అనుమతివ్వాలంటున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తమ పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి సోమవారం మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో బాబును కలిసి కనువిప్పు కార్యక్రమం చేపడతామని లగడపాటి చెప్పడం విడ్డూరమన్నారు.

బాబు పర్యటన ఆపే దమ్ము, ధైర్యం లగడపాటికి ఉందా అని ప్రశ్నించారు. లగడపాటి చీఫ్ ట్రిక్స్ మానకుంటే ఆయన నోటికి తాళం ఎలా వేయాలో తమకు తెలుసు అన్నారు. సమైక్యం కోసం ఆయన కలవాల్సింది తమ పార్టీ అధినేతని కాదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అన్నారు. బాబు అపాయింటుమెంట్ లగడపాటికి కలవాలంటే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలన్నారు.

అలా అయితే ఆయనకు అధినేతను కలిసే అవకాశమిస్తామన్నారు. జిమ్మిక్కులు చేయడం లగడపాటికి అలవాటే అన్నారు. రాష్ట్రంలో అస్థిరతకు కాంగ్రెస్సే కారణం అన్నారు. రాజకీయాల్లో లగడపాటి చిన్న పిల్లాడు అని, కాంగ్రెసు పార్టీయే నాన్చుడు ధోరణితో ఉందని తెలుసుకోవాలన్నారు. ఏ వైఖరి చెప్పని సొంత పార్టీని కాకుండా తమ పార్టీని విమర్శించడమేమిటని ప్రశ్నించారు. లగడపాటి కుర్ర చేష్టలు మానుకోవాలన్నారు. ప్రజలంతా బాగుండాలనేదే టిడిపి భావన అన్నారు.

లగడపాటి రాజగోపాల్ ఇలాంటి చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడటం సరికాదని దాడి వీరభద్ర రావు అన్నారు. తాము తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో తెచ్చే పరిస్థితుల్లో లేమని, కాంగ్రెసు పార్టీనే ఆయన నిలదీయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం లగడపాటి ఇలా చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

లగడపాటి గృహనిర్బంధం

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే లగడపాటిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించామని జిల్లా ఎస్పీ చెప్పారు. లగడపాటిని గృహనిర్బంధం చేసినట్లు చెప్పారు. ఎంపిని కలిసేందుకు చంద్రబాబు నాయుడు నిరాకరించారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారని ఎస్పీ అన్నారు.

హైదరాబాద్ రండి - విజయవాడలో సిద్ధం చేయండి

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పూలు ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని కృష్ణా జిల్లా టిడిపి నేత కేశినేని నాని అన్నారు. అందుకు ప్రతిగా లగడపాటి అనుచరులు ఆయన విజయవాడ పార్టీ కార్యాలయానికి వస్తారని, అక్కడ పూలు సిద్ధం చేసి ఉంచాలని కౌంటర్ ఇచ్చారు. బాబు సమైక్యవాదానికి అనుకూలంగా ప్రకటన చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.

ఉద్రిక్తత

చంద్రబాబును అడ్డుకునేందుకు బయలుదేరిన పలువురు కాంగ్రెసు నేతలను పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదుపులోకి తీసుకు వచ్చారు. బాబు మరికొద్ది గంటల్లో గరికపాడుకు రావడం ద్వారా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు.

English summary
Telugudesam Party leader Mothkupalli Narasimhulu has invited Vijayawada MP Lagadapati Rajagopal in to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X