హర్యానా మాజీ సిఎంకు, కొడుకుకు పదేళ్ల జైలు: ఉద్రిక్తం

Om Prakash Chautala
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామాకల కుంభకోణం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన తనయుడు అజయ్ చౌతాలాకు ఢిల్లీ కోర్టు పదేళ్ల కారాగార శిక్షను విధించింది. ఈ కుంభకోణానికి సంబంధించి చౌతాలాను పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. అక్రమ నియామాకాల కేసులో ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన తనయుడుతో పాటు 53 మందిని కోర్టు దోషులుగా గతవారం నిర్ధారించింది. ఈ రోజు నిందితులకు శిక్షను విధించింది.

అంతకముందు దక్షిణ ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలోని కోర్టు వద్ద చౌతాలా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోలీసుల పైకి వారు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల పైకి బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళనకారులు తగ్గక పోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. చౌతాలాకు శిక్షను ఖరారు చేయడానికి ముందు కోర్టు వద్ద ఆయన మద్దతుదారులు భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు.

కాగా ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా అరెస్టయిన విషయం తెలిసిందే. అయనతో పాటు ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మంది బుధవారం అరెస్టయ్యారు. చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హర్యానాలో 3000 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించారనే ఆరోపణలు ఎదుర్కున్న కేసులో చౌతాలాను న్యూఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది.

ఈ కేసులో నిందితులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులకు శిక్షను కోర్టు జనవరి 22వ తేదీన నిర్ధారిస్తుంది. హర్యానాలో 1999 - 2000 మధ్య 3.206 మంది జూనియర్ బేసిక్ టీచర్ల నియమాకం జరిగింది. ఈ కుంభకోణం కేసులో సిబిఐ 2008 జూన్ 6వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసింది.

ఒక్కో అభ్యర్థి తమ ఎంపిక కోసం 3 - 4 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు అంతకు ముందు ఆరోపణలు వచ్చాయి. అంతకు ముందు సిబిఐ కోర్టు ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసులో 2012 డిసెంబర్ 17వ తేదీన తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టి తమ ముందు జనవరి 16వ తేదీన హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+