వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ నేనూఉండాల్సింది: ఢిల్లీ రేప్‌ఘటనపై సుప్రీం సిజె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Altamas Kabir
న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో తాను కూడా పాల్గొని ఉండాల్సిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ సోమవారం అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలో గతంలో కూడా జరిగాయని కానీ, ఢిల్లీ ఘటనపై నిరసనలు వ్యక్తమవడం సబబే అన్నారు. ఇలాంటి నిరసన కార్యక్రమంలో తాను కూడా పాల్గొని ఉండాల్సిందని తాను భావిస్తున్నానని అన్నారు.

ఉవ్వెత్తున ఎగిసిన నిరసన సరైనదే అన్నారు. ఇలాంటివి అవసరం అన్నారు. గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టంపై జరిగిన ఆరో జాతీయ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన కొత్తదేమీ కాదన్నారు. కానీ ప్రజల మనసుల్ని అది కలచివేసిందని, పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసిందన్నారు. కాగా గతంలోనూ ఆయన నిరసనలను సమర్థించారు. నిరసనల్లో పాల్గొన్న వారందరికీ ప్రమాణాలు తెలిపారు.

ఢిల్లీ కేసు రహస్య విచారణ

యువతిపై అత్యాచార ఘటన కేసులో వాదనలు రహస్యంగా వినాలని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో కింది కోర్టు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఇక్కడి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లు తప్ప మిగిలిన వారంతా కోర్టు నుండి బయటకు వెళ్లాలని జడ్జి ఆదేశించారు.

అంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాన్ కృష్ణన్ వాదిస్తూ.. ఈ కేసు విచారణ బహిరంగమా లేక రహస్యమా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఐదుగురు నిందితులకు ముసుగు వేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. మరో నిందితుడిని బాల నేరస్థుల న్యాయస్థానం విచారిస్తుంది.

English summary
Chief Justice of India Altamas Kabir on Monday said that the huge public outrage and the protests that followed the brutal gang-rape of the 23-year-old paramedical student in Delhi on December 16, 2012 were justified and necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X