వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో కాంగ్రెస్ ఖతం!, దేవుడూ రక్షించలేడు: శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని ఆ దేవుడు కూడా కాపాడలేడని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు సోమవారం అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేయడానికే ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు. అలాంటప్పుడు సీమాంధ్రలో కాంగ్రెసును కాపాడటం కష్టమే అన్నారు.

ఎన్నికలు వస్తే చాలామంది కాంగ్రెసు నేతలు జగన్ వైపుకు వెళతారన్నారు. రాజమండ్రిలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో సీమాంధ్ర నేతలు చెప్పిన మాటలన్నీ అవాస్తవమేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం హైదరాబాదులో జరుగుతున్న కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు. త్వరలో తెలంగాణ రావడం ఖాయమన్నారు.

కాంగ్రెసు పని ఖతం

కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండేల వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానపర్చేలా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు కించపర్చారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసు పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను కాంగ్రెసు పార్టీ అతలాకుతలం చేస్తుందని విమర్శించారు. తెలుగు ప్రజల ఆగ్రహానికి కాంగ్రెసు మాడి మసైపోతుందన్నారు.

మంత్రి కుమారుడిపై సస్పెన్షన్ ఎత్తివేత

బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తనయుడి పైన కాంగ్రెసు పార్టీ సస్పెన్షన్‌ను సోమవారం ఎత్తివేసింది. సారయ్య తనయుడు బస్వరాజు శ్రీమాన్‌తో పాటు మరో ముగ్గురి పైన పార్టీ రాష్ట్ర నాయకత్వం బహిష్కరణ వేటును ఎత్తి వేసింది. కొద్ది నెలల క్రితం పోలీసుల పైన దాడి కేసుకు సంబంధించి పార్టీ శ్రీమాన్‌ను బహిష్కరించింది. ఇప్పుడు దానిని ఎత్తివేసింది.

English summary
Former Minister Shankar Rao said on Monday that no one protect Congress party in Seemandhra from YSR Congress chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X