ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆరో నిందితుడు మైనర్ అని ప్రకటన

స్కూల్ సర్టిఫికెట్‌ను చూపుతూ ఆరో నిందితుడు 1995 జూన్ 4వ తేదీన జన్మించినట్లు జువనైల్ జస్టిస్ బోర్డు తెలిపింది. పోలీసులు అతనికి బోన్ ఆసిఫికేషన్ టెస్టు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్కూల్ సర్టిఫికెట్‌ను చూపుతూ ఆ అవసరం లేదని జువనైల్ బోర్డు అంటోది.
జువనైల్ జస్టిస్ బోర్డు సందేహాలు వ్యక్తం చేస్తే మాత్రమే బోన్ ఆసిఫికేషన్ టెస్టు వయసు నిర్ధారణ కోసం అనుమతిస్తారు. పాఠశాల సర్టిఫికెట్ పట్ల బోర్డు విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తాము ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తామని నిందితుడికి వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాది అంటున్నారు. మైనర్ అయినందున ఆరో నిందితుడిని జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద మాత్రమే విచారిస్తారు. దాని కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, పడుతుంది.
కదులుతున్న బస్సులో ఆ మధ్య దారుణంగా ఆరుగురు పారా మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించింది. ఆరుగురు నిందితుల్లో ఒకతను మైనర్ కావడం గమనార్హహం.












Click it and Unblock the Notifications