జగన్ డబ్బు పిచ్చోడు, సైకోలా చేసేవాడు: సిఎం రమేష్

సౌదీ అరేబియా వంటి దేశాల్లో 35 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన రాజులు రూ.25 వేల కోట్లు సంపాదిస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడైన జగన్ అవినీతిమార్గంలో కేవలం ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించారన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా అంతటి వారికే తప్పు చేస్తే శిక్ష పడిందని, జగన్‌కు కూడా శిక్ష తప్పదని అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న హయాంలో జగన్ హైదరాబాద్‌కు వచ్చినపుడల్లా ఎందుకు వచ్చాడని బాధపడేవారని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి రోశయ్యే టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు.. జగన్ విశ్వరూపం ప్రజలకు మొదట్లో అర్థం కాలేదని, రాను రాను ప్రజలు జగన్ చేసిన అవినీతి, అక్రమాలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.
సానుభూతితో వైయస్సార్ కాంగ్రెసు నెట్టుకొస్తోందని, సానుభూతి ఎల్ల్లకాలం ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఆరంభమైందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు.












Click it and Unblock the Notifications