సమైక్యంపై విహెచ్ ఫైర్: కెసిఆర్‌పై కేసుకు మంత్రి ప్రసాద్

తెలంగాణపై అధిష్టానం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడిన తర్వాతనే సమైక్యవాదం ప్రారంభమైందని ఆయన ధ్వజమెత్తారు. జగన్‌కు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు సభలు ఎందుకు పెట్టడం లేదన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా సభలు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రం విడిపోతేనే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సామరస్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయేందుకు అందరూ సహకరించాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమైనా మాట్లాడతాడని, ఆయనది ప్రాంతీయ పార్టీ కాబట్టి అలా మాట్లాడతారని, తమదీ జాతీయ పార్టీ కాబట్టి అలా కుదరదన్నారు.
కెసిఆర్ పైన కేసు పెడతాం
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రిని, దేశాన్ని కించపర్చేలా మాట్లాడారని, అందుకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు.
కెసిఆర్ అప్పుడు ఏం చేశారు?
కెసిఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం ఎందుకు మాట్లాడలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 610 జివో గురించి, 6 సూత్రాల పథకం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications