తెలంగాణ: కెసిఆర్‌పై కాంగ్ రివర్స్అటాక్, కెవిపిపై యాష్కీ

Vivek - Madhu Yashki
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు, పార్లమెంటు సభ్యులు మంగళవారం నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన కెసిఆర్ వ్యాఖ్యలు అనాగరికమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమరంతో రాదని, సామరస్యంతోనే వస్తుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ సెంటిమెంటుతో తన పార్టీ బలం పెంచుకోవడమే కెసిఆర్‌కు కావాలన్నారు. ఆయన తన బలం పెంచుకోవడమే తప్ప తెలంగాణ రావాలని కాదన్నారు. తెలంగాణపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. ప్రధానిపై కెసిఆర్ వ్యాఖ్యలు సరికాదని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని అందరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఉద్యమంలో తొందరపాటు వ్యాఖ్యలు తగవని కెసిఆర్‌కు హితవు పలికారు.

తెలంగాణ కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమ కార్యాచరణ పైన, రాజీనామాల పైన తమ ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు ఖండించదగ్గవి అన్నారు. తెలంగాణపై కెసిఆర్‌కు, జెఏసికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ టిడిపి నేతలను కూడా ఆహ్వానించాలని సూచించారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అడ్డంకి అన్నారు.

తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం విషయంలో తాము కెసిఆర్ నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ కోసం తాను మొదటి నుండి ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పారు. రాష్ట్రం కోసం విద్యార్థులు రక్తం కార్చుతుంటే కొందరు మాటలు చెబుతున్నారని విమర్శించారు.

తమ ఉద్యమం వెనుక కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఉన్నారని చెప్పారు. తెలంగాణను ఇవ్వమని కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. తెలంగాణవాదులు రాజీలేకుండా రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. తాను, తన సహచరులు కూడా ఉద్యమిస్తున్నారన్నారు. సీమాంధ్రకు చెందిన రాజకీయ వ్యాపారులు తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణకు అడ్డపడుతున్న శత్రువులే లక్ష్యంగా మేం ఉద్యమిస్తామన్నారు.

రాజీనామాలపై సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణను రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు అడ్డుకుంటున్నారన్నారు. ఆయనే ఈ స్థితికి తీసుకు వచ్చాడని మండిపడ్డారు. కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ వంటి తెలంగాణ వ్యతిరేకుల అక్రమాలను తాము బయటపెడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+