పడగవిప్పిన ఫ్యాక్షన్: జగన్ పార్టీ కార్యకర్త దారుణహత్య

దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. అతను జగన్ పార్టీకి చెందిన కడిమెట్ల కిట్టుగా గుర్తించారు. హంతకులు పరారీలో ఉన్నారు. కిట్టు తండ్రి వెంకటనాయినిపల్లి సొసైటీ డైరెక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సహకార ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహకార ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో హత్య జరగటం స్థానికంగా కలకలం రేపింది. పాతకక్షలు కూడా కారణం కావచ్చని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి చంపారని మృతుడు తల్లి రోదిస్తూ చెబుతోంది.
నల్గొండలో బస్సు బోల్తా
నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద ఈ రోజు ఉదయం ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications