ఆంధ్రప్రదేశ్‌లో బెంగళూర్ టెక్కీ మిస్సింగ్, కిడ్నాప్?

ఆ రోజు గానీ ఆ తర్వాతి రోజు గానీ ఆ ప్రాంతంలో ఏ విధమైన ప్రమాదం సంభవించలేదని పోలీసులు అంటున్నారు. 37 ఏళ్ల ప్రభును నక్సలైట్లు కిడ్నాప్ చేసి ఉండవచ్చుననే అనుమానాలను అతని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆప్టిమిస్టిక్ ఐటి సొల్యూషన్స్ అనే ప్రైవేట్ ఐటి కంపెనీలో ప్రభు సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అతను జనవరి 11వ తేదీన హైదరాబాదుకు వచ్చాడు.
హైదరాబాదులో పని పూర్తి చేసుకుని జనవరి 12వ తేదీన బెంగళూర్ బయలుదేరాడు. తాను బెంగుళూర్ తిరిగి వస్తున్నట్లు ఆ రోజు రాత్రి పదిన్నర గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అతని నుంచి ఏ విధమైన సమాచారమూ లేదు. అతని నల్ల షవర్లెట్ బీట్ కారు రాత్రి 10 గంటల 57 నిమిషాలకు కర్నూలు జిల్లాలో ఓ టోల్ గేట్ దాటినట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాతి టోల్ గేట్‌కు మాత్రం అది చేరుకోలేదు.
జనవరి 13వ తేదీ నుంచి తన సోదరుడి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయని ప్రభు తమ్ముడు ఎంవి ప్రసాద్ ఓ ఆంగ్ల దినపత్రికతో చెప్పాడు. దాంతో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదమేదైనా జరిగిందేమోనని తాము భయపడ్డామని, అయితే ఆ రోజు రోడ్డు ప్రమాదమేదీ జరగలేదని అధికారులు చెబుతున్నారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications