యడ్డీపై బిజెపి ఎదురుదాటి: అనర్హత, ఎమ్మెల్యేలతో భేటీ!

ఇప్పుడు బిజెపి కూడా అదే ప్రయోగానికి సిద్ధమవుతోంది. యడ్డీ అవిశ్వాసం పెట్టే పరిస్థితి ఉంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యడ్డీ వర్గం ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేందుకు సిద్దమవుతోంది. తద్వారా ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తోంది. యడ్డీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. వారి సభ్యత్వాల్ని రద్దు చేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ ఇద్దరు యడ్డీ వర్గం ఎమ్మెల్యేల పైన స్పీకర్ బోపయ్యకు ఫిర్యాదు చేశారు.
సోమవారం సభాపతి అందుబాటులో లేనందున ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. బిజెపిపై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరారు. అనర్హత వేటు భయంతో యడ్డీ వర్గం ఎమ్మెల్యేల్లో ఇద్దరు వెనక్కి తగ్గారు.
తగ్గిన యడ్డీ
బిజెపి అనర్హతతో ఎదురుదాడికి దిగడంతో యడ్డీ తగ్గారు. తనకు శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశ్యం లేదని, 2013 14 బడ్జెట్‌ను ఆయనే శాసనసభలో ప్రవేశ పెడతారని, ప్రస్తుతం బిజెపి, కెజెపి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కాగా స్పీకర్ బోపయ్య నేడు యడ్డీ వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications