స్కూల్ లంచం కేసు: మంత్రి రాంరెడ్డికి హైకోర్టులో షాక్

ఈ కేసుకు సంబంధించి హైకోర్టుకు హాజరైన ఖమ్మం టెక్నో స్కూల్ యాజమాన్యం రూ.35 లక్షలు లంచం ఇచ్చామని కోర్టుకు వెల్లడించింది. పాఠశాల కరస్పాండెంట్, పిటిషనర్ బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరై తాము మంత్రికి, ఆయన అనుచరులకు రూ.35 లక్షల రూపాయల లంచాన్ని వేర్వేరు మార్గాల ద్వారా ఇచ్చినట్లు తెలిపారు.
కాగా మంత్రికి లంచం ఇచ్చామని ఖమ్మం జిల్లా ఎన్కూరులోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం హైకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఇతర అధికారులు 15 లక్షల రూపాయలు తీసుకున్నారని స్కూలు యాజమాన్యం ఆరోపించింది. శ్రీచైతన్య టెక్నో స్కూల్ కరస్పాండెంట్ గుగులోత్ చిన్నా, ప్రధానోపాధ్యాయుడు వి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి విచారణ చేపట్టారు.
ముడుపులు ఇచ్చినందుకు పిటిషనర్లపై కూడా చర్యలు ఉంటాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపించారు. అప్పుడు విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. స్కూలును డిసెంబర్ 31వ తేదీ నుంచి మూసేయాలని డిఇవో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ వేశారు. మంత్రికి, ఇతర అధికారులకు ఇచ్చిన 50 లక్షల రూపాయలను తమకు తిరిగి ఇప్పించాలని, మంత్రి ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని, ఇతర అధికారులపై ఎసిబి దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.
కాగా, శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం ఆరోపణలను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు ఖండించారు. శ్రీచైతన్య టెక్నో స్కూల్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఎవరి వద్ద కూడా తాను డబ్బులు తీసుకోలేదని ఆయన అన్నారు. తనపై కేసు వేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. కేసు వేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications