హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డా.బూతుల చక్రవర్తి!: సోమిరెడ్డి, భాషకాదు: మందకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy-Manda Krishna Madiga
హైదరాబాద్/నెల్లూరు: బూతులు తిట్టడంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు డాక్టరేట్ ఇవ్వవచ్చునని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనకు బూతుల సామ్రాట్ అని బిరుదు ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు.

తాము నీళ్లు దోచుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. నెల్లూరు ప్రజలు సోమశిల నీటిని దోచుకోవడం లేదని, పెన్నా నీటిని మాత్రమే ఉపయోగిస్తున్నారని అన్నారు. కెసిఆర్‌కు పిచ్చిపట్టి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా మిగిలు జలాల్లో తమకు హక్కు లేదని వ్యాఖ్యానించడం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు.

హూందాగా ఉండాలి

ప్రత్యర్థులపై విమర్శలు చేస్తే హుందాగా ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అన్నారు. ప్రత్యర్థిని ఎదుర్కోవడమంటే వారిని అవమానపర్చడం కాదన్నారు. హుందాతనం ముఖ్యమన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు సీమాంధ్రలో ఉన్న జై ఆంధ్రా ఉద్యమకారుల మనసులను గాయపర్చాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగు సరిగా రాకపోవచ్చునని అయితే, బూతులు తిట్టడం మాత్రం తెలుగు కాదని కెసిఆర్‌ను ఎద్దేవా చేశారు. ఇతరలను అవమానపర్చేలా ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు.

రెచ్చగొట్టొద్దు

ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) అన్నారు. ఇప్పటికే మతాలను కించపర్చేలా మాట్లాడిన వారు జైలులో ఉన్నారన్నారు. ప్రాంతాలను, మతాలను, కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే వారికీ అదే గతి పడుతుందన్నారు.

English summary
Telugudesam Party senior leader and former minister Somireddy Chandramohan Reddy said TRS chief K Chandrasekhar Rao should be honored for his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X