తెలంగాణపై వెనక్కి తగ్గం: ఎఐసిసి ప్రతినిధి చాకో

తెలంగాణపై తాము ఇచ్చిన హామీని ఎలా అమలు చేయాలనే విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణపై తాము గతంలోనే నిర్ణయం తెలిపామని, రెండో ఎస్సార్సీ వేయాలని తాము ఎన్డియే ప్రభుత్వ హయాంలో అప్పటి హోం మంత్రి ఎల్‌కె అద్వానీకి లేఖ రాశామని ఆయన అన్నారు. అయితే పార్టీ నిర్ణయం వేరు, ప్రభుత్వ నిర్ణయం వేరు అని ఆయన అన్నారు. అందరితో మాట్లాడిన తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్ాపరు.
తెలంగాణకు తమ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావు అన్నారు. ఆసల్యం చేస్తే పార్టీకి చేకూరాల్సిన ప్రయోజనం చేకూరదని తాము ఆందోళన చెందుతున్నామని ఆయన బుధవారం హైదరాబాదులో అన్నారు. గడువు చెప్పలేనని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నప్పటికీ సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణకు గడువు లేదని షిండే చెప్పడం కంటే ఇచ్చేది లేదని చెప్పి ఉంటే బాగుండేదని కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. షిండే వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు తొందరపడి ఢిల్లీ పర్యటన నిర్ణయం తీసుకున్నారని, వారిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ విధానాన్ని ప్రతిబింబించాలని అంటున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ విధానం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications