హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం బాధపడ్డారన్న మంత్రి, శంకరన్న దురుసు: పోలీస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు పి.శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చింతించారని మంత్రి ప్రసాద కుమార్ శుక్రవారం అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రసాద రాజులు మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రసాద రాజు పోలీసులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సీనియర్ అధికారితో విచారణ జరిపిస్తామని సిఎం హామీ ఇచ్చారని చెప్పారు.

పోలీసులు శంకరరావు పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయన అన్నారు. ఈ ఘటనపై సిఎం చింతించరని, తనకు తెలియకుండా ఇది జరిగిందని చెప్పారన్నారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. శంకరరావు పట్ల పోలీసులు అత్యుత్సాహం వల్ల దళితులు అందరూ బాధపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి త్వరలో విచారణ జరిపిస్తారని చెప్పారు.

విచారణకు సహకరించలేదు, దురుసుగా ప్రవర్తించారు

మాజీ మంత్రి శంకరరావు విచారణకు ఎప్పుడూ సహకరించలేదని అల్వాల్ డిసిపి వేరుగా చెప్పారు. పోలీసుల డ్యూటీని అడ్డుకున్నందునే ఆయనపై క్రిమినల్ కేసు పెట్టవలసి వచ్చిందన్నారు. ఆయనను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత దర్యాఫ్తు తిరిగి ప్రారంభిస్తామన్నారు. మల్కాజిగిరి భూ వివాదం కేసులో ఆయనకు మూడుసార్లు నోటీసులు ఇచ్చామని చెప్పారు.

ఆయన విచారణకు ఎప్పుడూ సహకరించలేదన్నారు. మూడుసార్లు విచారణకు ప్రయత్నించినా కుదరలేదన్నారు. మొహం చాటేశారని చెప్పారు. నిన్న విచారణ కోసమే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని, గంట సేపు బతిమాలినా సహకరించకపోగా పోలీసులను దుర్భాషాలు ఆడారని చెప్పారు. అందుకే పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చామన్నారు. ఆయనను కేసులో ముద్దాయిగా పరిగణించలేదన్నారు. ఆయన కోరిక మేరకే వైద్య సహాయం అందించామన్నారు.

English summary
Some leaders like MP Vivek and Mandakrishna Madiga are targeted CM Kiran Kumar Reddy in former minister Shankar Rao row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X