లోకేష్ చదువు: బాబు ఆస్తులపై లోకాయుక్తలో పిటిషన్

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం శుక్రవారం లోకాయుక్తలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన లోకాయుక్త విచారణను ఈ నెల 26వ తేదికి వాయిదా వేసింది. 26న పిటిషనర్ తరఫు వాదనలను లోకాయుక్త వింటుంది. పిటిషన్ విచారణార్హమైనదా? లేదా? అని నిర్ణయించుకుంటుంది. విచారణకు అర్హమైనది అయితే చంద్రబాబుకు నోటీసులు పంపిస్తుంది.

చంద్రబాబు నాయుడు తన పాలనలో భారీ అక్రమాస్తులు సంపాదించారని తెలంగాణ జూనియర్ న్యాయవాదులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని, కుటుంబ ఆస్తులు పెంచుకున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఇతరులతో కలిసి బాబు పెద్ద ఎత్తున బినామీ ఆస్తులను కూడబెట్టుకున్నాడని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్‌ను విదేశీ యూనివర్సిటీలలో చదివించారని, అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో లెక్క తేలాలని పేర్కొన్నారు. వాటి లెక్క తేల్చాల్సిన అవసరముందన్నారు. తన కోడలు, బాలకృష్ణ కూతురు అయిన బ్రాహ్మిణి పేరిట కూడా ఆస్తులు సంపాదించుకున్నట్లుగా ఆరోపించారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని బాబు తన పాలనలో ప్రజల ఆస్తిని దోచుకున్నారన్నారు.

చంద్రబాబు ఆస్తుల పైన పలుమార్లు, పలువురు కేసులు వేసినప్పటికీ కోర్టుల నుండి స్టే తెచ్చుకొని ఆయన విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. బాబు ఆస్తుల పైన విచారణ జరిపించి ఆయన అక్రమాస్తులు, బినామీ ఆస్తులు బయటపెట్టాలని వారు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+